Sunday, May 07, 2006

తిరుగు ప్రయాణం

సోమవారం, వ్యయ నామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి, 1928 శా.శ

పొద్దున్నే ఆడవాళ్ళందరూ రెండో సారి గుడికెళ్ళొచ్చారు. రావటం రావటం సామాన్లు సర్దుకున్నారు. అమ్మా, నాన్న, అత్తా ముగ్గురూ మళ్ళా షాపింగ్ కు వెళ్ళారు. మేమందరం హోటల్లో వున్నాం. బావల్తో, తాతతో నాకు కాలక్షేపం.

సాయిప్రియలో భోజనంచేసి, హోటల్ వెకేట్ చేశాం. బస్టాండ్ ఎదురుగనేవుంది. సామాన్లు చేరేసిన తర్వాత కనుక్కుంటే, వినయ్ మామ వాళ్ళ బస్ ఇంకా రాలేదు. ఇంకో గంటలో వస్తుందట. శిర్డీలో మధ్యాహ్నం సుమారు రెండున్నరకు మహరాష్ట్ర ఆర్టీసీలో మన్మాడ్‌కు బయలు దేరాం నేనూ, అమ్మా, నాన్న, తాతయ్య, నాన్నమ్మానూ. బయలు దేరేటప్పుడు ఖాళీగానే వున్నా, అరగంటలో ఫుల్‌రష్‌. మరోపక్క ఎండ. నేనైతే ఆ ఎండలోనే తాతగారి చేతిలో నిద్దరోయా! (మనకది మామూలేగా!) కండక్టరు సరిగ్గా బ్రిడ్జ్‌ మీద ఆపి దింపాడు. మాతో పాటు చాలా మంది దిగారు. బ్రిడ్జి క్రిందే మన్మాడ్‌ రైల్వే స్టేషన్‌. కానీ పన్నెండు శాల్తీ లుండంతో ఇద్దరు కూలీలను మాట్లాడారు ముప్పై రూపాయలకు. సామాన్లు బరువెక్కువుండడంతో ఓ పదిరూపాయలెక్కువిచ్చాడు నాన్న.

ఓ గంటన్నర వెయిట్ చేసిన తర్వాత రైలు (మన్మాడ్‌-సికింద్రాబాద్‌) వచ్చింది. ‌రైల్లో కీచెయిన్స్ అమ్మేవాళ్ళొస్తే అమ్మా, నానమ్మా, తాతయ్యా ఓ ఇరవై కీచెయిన్స్ కొన్నారు.

రైల్వే వాళ్ళ కేటరింగ్ వాళ్ళు మూడు భోజనాలు, ఒక వెజ్ బిరియానీ చెబితే - నాలుగు భోజనాలు తెచ్చిచ్చాడు. రాత్రి ఎనిమిదింటికి పోట్లాడితే, పదింటికి తెచ్చిచ్చాడు. పాపం తాత లేటుగా భోంచేశాడంట. పదకొండయ్యేసరికి అందరూ బెర్తులెక్కేశారు నిద్ర పోవడనికి. నేనైతే ఎనిమిదింటికే పడకేశా - పొద్దున్నే లేచి ఆడుకోవాలిగా మరి.

గుడ్‌నైట్

3 అభిప్రాయాలు :

At 1:55 AM, Blogger kiran kumar Chava said...

SuBa raatri

 
At 11:09 PM, Blogger Scott Fish said...

My Forums talk about this as well.
India Forums

Its located at http://www.india-news.in

 
At 3:32 AM, Blogger Ramesh said...

హలో friends మీకు న్యూస్ చదవడానికి ఎక్కువ time లేదా? అయితే మీకోసం, ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా...చేప్పాడానికి మేము ఓ క్రొత్త వెబ్ సైట్ start చేసాము తప్పక చూడండి. http://www.apreporter.com
ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా... http://www.apreporter.com

 

Post a Comment

<< Home