Tuesday, January 10, 2006

నాన్నొస్తున్నాడోచ్‌

మంగళ వారం, పుష్య శుద్ధ ఏకాదశి, 1927 శా.శ

పెద్దగా చెప్పేందుకేమీ లేదు ... ఒక్కటి తప్ప. నాన్నొస్తున్నాడోచ్‌
సంక్రాంతి పడుగకు నాన్న వైజాగు పట్టణానికి వస్తున్నాట్ట. అమ్మా, అమ్మమ్మా వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. అంతేకాదు, శివ ప్రసాదు తాతగారు కూడా ఛత్తీస్‌గఢ్‌ నుండి వస్స్తున్నారట.

ఐ యామ్‌ ఫీలింగ్‌ ఎక్సైటెడ్‌.
సీ యూ లేటర్‌.

Sunday, January 01, 2006

కొత్త సంవత్సరపు డిక్లరేషన్‌

ఆదివారం, పార్థివ నామ సంవత్సర పుష్య శుద్ధ పాడ్యమి, 1927 శా.శ

నూతన సంవత్సర శుభాకాంక్షలు


ఇక నుండీ తెలుగు కేలండర్‌ (పంచాంగ మనాలేమో) ప్రకారం తారీఖులుంటాయి. ఎలాగూ బ్లాగు పైన ఇంగ్లీషులో డేటుంటుందిగా.